తిరుమల లడ్డూలో కల్తీ వివాదంపై జరుగుతున్న విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు. 2024, అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు విచారణ జరగాల్సింది ఉంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తరపున తన సమాధానం చెప్పాల్సిన సొలిసిటరీ జనరల్.. సమయం కోరారు. దీంతో కేసు విచారణను అక్టోబర్ 4వ తేదీ ఉదయానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
అత్యంత పవిత్రంగా భావించే శ్రీవేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది.. లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ అయ్యిందని.. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇది కూడా జగన్ ప్రభుత్వంలో జరిగిందని చెప్పుకొచ్చారు. దీనిపై అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితోపాటు ప్రముఖ లాయర్ సుబ్రమణ్యస్వామి పిటీషన్లు వేశారు. గతంలో విచారణ సందర్భంగా పలు ప్రశ్నలు సంధిస్తూ.. దీనిపై వివరణ ఇవ్వాలంటూ టీటీడీతోపాటు ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు.
ALSO READ | ఇద్దరు వేరు వేరు సమాధానాలు చెప్తే ఎలా..? లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు
తదుపరి విచారణలో భాగంగా అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం విచారణ చేయాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం తరపున తన సమాధానం చెప్పాల్సిన సొలిసిటరీ జనరల్.. సమయం కావాలని కోరగా.. విచారణను అక్టోబర్ 4వ తేదీ ఉదయానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.