ఏపీలో గత ప్రభుత్వం అమలు చేసిన కొత్త ఇసుక పాలసీ అక్రమాలకు దారి తీసిందన్న ఆరోపణలున్న సంగతి తెలిసిందే.ఈ పాలసీని అడ్డంపెట్టుకొని వైసీపీ నాయకులూ అవినీతికి పాల్పడ్డారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం తదుపరి విచారణను ఆగస్టు 2కు వాయిదా వేసింది. ఆగస్టు 2 కల్లా ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.
ఏపీలో ప్రభుత్వం మారిందని,అక్రమ ఇసుక తవ్వకాలపై సమగ్ర నివేదిక సమర్పించేందుకు సమయం కావాలని కోరారు ప్రభుత్వ తరపు న్యాయవాది. ఏపీలో 7 జిల్లాల్లో అక్రమ ఇసుక తవ్వకాలపై తనిఖీలు పూర్తి చేసామని, మరో 6 జిల్లాల్లో తనిఖీలు చేయాల్సి ఉందని కేంద్ర పర్యావరణ శాఖ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు.