- మేజర్ అయిన కూతురు పెండ్లిని ఒప్పుకోవాలని తల్లిదండ్రులకు సుప్రీం కోర్టు సూచన
న్యూఢిల్లీ: పిల్లలు మన ఇంట్లో వస్తువుల్లా వ్యక్తిగత ఆస్తులు కాదని.. వారి బంధాల్ని మనం అంగీకరించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. తన కూతురు ఇంకా మైనర్ అని ఆమె వివాహాన్ని రద్దు చేసి ప్రేమికుడిని శిక్షించాలని పిటిషన్ వేసిన తల్లిదండ్రులకు ఈ మేరకు సూచించింది. వివాహం చేసుకునే సమయానికి అమ్మాయి మేజర్అని తెలిపింది. తన కూతురు మైనర్ అని మాయమాటలతో ఆమెను కిడ్నాప్ చేసి, వివాహం పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ప్రేమికుడిపై మధ్యప్రదేశ్రాష్ట్రం మహిద్‌పూర్‌కు చెందిన ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసును మధ్యప్రదేశ్‌లోని ఇండోర్హైకోర్టు బెంచ్ విచారించి.. గత ఆగస్టు 16న తీర్పు చెప్పింది. పెండ్లి చేసుకున్న సమయంలో యువతి మేజర్ అని యువకుడిపై కేసును కొట్టివేసింది. దీంతో తమ కూతురు మైనర్‌అని ఆమె పెండ్లి రద్దు చేయాలని యువకుడిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించాలని కోరుతూ యువతి తల్లిదండ్రులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఈ కేసును సీజేఐ సంజీవ్కన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ బెంచ్విచారించింది. ‘‘బిడ్డలు ఇంట్లో వస్తువుల్లా వ్యక్తిగత ఆస్తులు కాదు. వారిని శిక్షించే అధికారం మీకు లేదు. వారి అనుబంధాల్ని మీరు అంగీకరించాలి”అని సీజేఐ సంజీవ్ ఖన్నా తల్లిదండ్రులకు సూచించారు. తల్లిదండ్రులు సమర్పించిన బర్త్ సెర్టిఫికెట్లో తేడాలు ఉన్నాయని తెలిపింది. అలాగే హైకోర్టు ఆర్డర్‌ను పక్కన పెట్టేందుకు ఎటువంటి ఆధారం కనిపించడం లేదంటూ పిటిషన్‌ను కొట్టేసింది.