భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. అత్యాచారానికి గురైన 14 ఏళ్ల మైనర్ బాధితురాలు గర్భం దాల్చితే.. 30వ వారంలో కూడా అబార్షన్ చేయించుకోవచ్చని సుప్రీం కోర్టు ఓ కేసులో తేల్చి చెప్పింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 2021 ప్రకారం.. డాక్టర్ అభిప్రాయంతో 20 వారాల గర్భాన్ని తొలగించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో 24 వారాల ప్రెగ్నెన్సీ టైంలో కూడా అబార్షన్ చేసుకోవచ్చు. కానీ అంతకు మించి చివరి దశలో అబార్షన్ చేసుకోవడానికి కోర్టు అనుమతి తీసుకోవాలి.
ప్రసెంట్ కేసు
14 ఏళ్ల అత్యాచార బాధితురాలు గర్భం దాల్చింది. తన 30వ వారంలో ఆ గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతి ఇవ్వాలని బాంబే హైకోర్టును ఆశ్రయించింది. అందుకు బాంబై కోర్టు అనుమతి ఇవ్వలేదు. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆమె తల్లి చేసిన పిటిషన్‌పై ఏప్రిల్ 19న మైనర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
డాక్టర్ల సలహా మేరకే..
సీజేఐ DY చంద్రచూడ్ ధర్మాసనం ముందు ఆ కేసు ఏప్రిల్ 22న విచారణ జరిగింది. బాంబే కోర్టు తీర్పును కొట్టివేస్తూ.. సుప్రీం కోర్టు అత్యాచారానికి గురైన 14ఏళ్ల బాలిక 210రోజులకు డాక్టర్ల సలహా మేరకు అబార్షన్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ప్రెగ్నెన్సీ చివరి దశలో అబార్షన్ చేయించుకోవడం ప్రమాదకరమైనప్పటికీ.. ఇప్పుడున్న వైద్య సదుపాయాలు గతంతో పోల్చుకుంటే చాలా మెరుగైనవని.. ప్రాణాలకు ముప్పు కాదని కోర్టు భావించింది. ఈ విషయంలో మెడికల్ బోర్డ్ అభిప్రాయాన్ని కోర్టు కోరింది.