న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖీంపూర్ ఖేరీ కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయకపోవడంపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఈ ఘటనను సుమోటాగా స్వీకరించిన అత్యున్నత ధర్మాసనం.. ఆశిష్ మిశ్రాను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. ఈ ఘటనపై యూపీ సర్కార్ తీసుకుంటున్న చర్యల మీద కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు విచారణను సీబీఐ లాంటి సంస్థలకు అప్పగించడం పరిష్కారం కాదని పేర్కొంది. ఇతర ఏజెన్సీకి కేసును అప్పగించే వరకు ఆధారాలను కాపాడతామని డీజీపీ నుంచి హామీ తీసుకోవాలని యూపీ ప్రభుత్వానికి సీజేఐ సూచించారు. ఈ ఘటన దారుణమని పేర్కొన్న కోర్టు.. నిందితులకు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేసింది. కేసుకు ఉన్న సున్నితత్వం దృష్ట్యా అవసరమైన చర్యలు తీసుకోవాలని యోగి ఆదిత్యనాథ్ సర్కారును ఆదేశించింది.
Suo-motu hearing in SC on Lakhimpur Kheri violence
— ANI (@ANI) October 8, 2021
Harish Salve for UP govt says the post mortem report did not show gun shot injury. They have found two cartridges, maybe the accused had a bad aim.
CJI asks Salve, so this is a ground for not taking custody of the accused?