
తిరుపతి: తిరుమల తిరుపతి పర్యటనకు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రధాన ద్వారం వద్ద రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవో వీరబ్రహ్మం, టీటీడీ చీఫ్ సెక్యూరిటీ విజిలెన్స్ ఆఫీసర్ గోపినాథ్ జెట్టి, విజిఓ మనోహర్, ఆలయ డెప్యూటీ ఈఓ కస్తూరిబాయి, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఉక్రెయిన్ నుంచి వచ్చిన కొడుకుని హత్తుకుని ఏడ్చేసిన తల్లి
మంత్రి జగదీష్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్
డిసెంబర్ లో అసెంబ్లీని రద్దు చేసి మార్చిలో ఎన్నికలకు వెళ్తడు