ఫిబ్రవరి నెలాఖరులోపు గ్రూప్స్​ ఫలితాలు.. సుప్రీం కోర్టులో కేసులు కొట్టివేయడంతో తొలగిన అడ్డంకులు

ఫిబ్రవరి నెలాఖరులోపు గ్రూప్స్​ ఫలితాలు.. సుప్రీం కోర్టులో కేసులు కొట్టివేయడంతో తొలగిన అడ్డంకులు
  • ముందుగా గ్రూప్1 జీఆర్ఎల్.. ఆ తర్వాత గ్రూప్2, గ్రూప్3 రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  • చివరి దశలో వాల్యుయేషన్ ప్రక్రియ

హైదరాబాద్, వెలుగు: ఈ నెలాఖరులోపు గ్రూప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు టీజీ పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. సుప్రీంకోర్టులో దాఖలైన కేసులన్నీ కొట్టివేయడంతో ఫలితాల విడుదలకు అడ్డంకులు తొలిగిపోయాయి. దీంతో ఈ నెలాఖరులోగా గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1తో సహా గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2, 3 ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫలితాలను కూడా రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు టీజీ పీఎస్సీ రెడీ అవుతున్నది. ముందుగా గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1 జనరల్ ర్యాకింగ్ లిస్టు (జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ను రిలీజ్ చేసి.. ఆ తర్వాత రిజర్వేషన్ల ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. తర్వాత మార్చి నెలాఖరులోపు రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రక్రియ మొత్తం పూర్తి చేసే యోచనలో పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది.

కాగా, రాష్ట్రంలో గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు 563 పోస్టుల భర్తీకి గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. వీటికి 31,403 మంది అటెండ్ కావాల్సి ఉండగా, 21,093 (67.17%) మంది హాజరయ్యారు. ఏడు పేపర్లకు సంబంధించి మూడు నెలలుగా వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ చివరి దశకు చేరింది. రెండు, మూడు వారాల్లోనే జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్టులు రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు, జీవో 29ను రద్దు చేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేయగా, సోమవారం వాటిని కోర్టు కొట్టివేసింది. దీంతో ఫలితాల విడుదల లైన్ క్లియర్ అయింది.

వరుసగా గ్రూప్ 1, 2, 3..
ముందుగా గ్రూప్ 1 జీఆర్ఎల్ రిలీజ్ చేసిన తర్వాత, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేయాలని టీజీపీఎస్సీ యోచిస్తున్నది. గ్రూప్ 1 జీఆర్ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ర్యాంకులను బట్టి అభ్యర్థులకు ఏయే సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందో తెలుసుకునే చాన్స్ ఉంది. దీంతో ఒకవేళ గ్రూప్1​ వచ్చి, గ్రూప్ 2, గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3​లకు ఎంపికైనా.. అలాంటి వాళ్లు చివరి రెండింటిని వదులుకుంటారు. దీని వల్ల బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాగ్ పోస్టులు మిగిలే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండదని ఆఫీసర్లు భావిస్తున్నారు. కాగా, గతేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 783 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 పరీక్షలు జరగ్గా, 2,51,486 (45.57%) మంది హాజరయ్యారు. గత నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1,363 గ్రూప్ 3 పోస్టులకు 2,69,483 మంది పరీక్షలు రాశారు.