ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నగదు కేసు.. వీడియోలు విడుదల చేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నగదు కేసు.. వీడియోలు విడుదల చేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు నగదు లభ్యమైనట్లు అధికారికంగా ప్రకటించింది సుప్రీంకోర్టు. శనివారం హైకోర్టు అంతర్గత విచారణ రిపోర్టును విడుదల చేసింది. మార్చి 21న జస్టిస్ వర్మ అధికారిక బంగ్లాలో గదిలో ఉన్న డబ్బుకు సంబంధించి విచారణ చేయాలని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయను సుప్రీంకోర్టు ఓ లేఖలో కోరింది. దీనికి సంబంధించి కొన్ని వీడియోలు, ఫొటోలను ఆదివారం (మార్చి23) అప్లోడ్ చేసింది.

ఈ ఫొటోల్లో, వీడియోలో ఫైర్ సిబ్బంది ప్లాస్టిక్ సంచులలో సగం కాలిపోయిన నగదును బయటకు తీస్తున్నట్లు కనిపిస్తోంది. హైకోర్టు నివేదికను బహిర్గతం చేయడానికి ముందు చీఫ్ జస్టిస్ ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొలీజియంలోని సీనియర్ సభ్యునికి తెలియజేసినట్లు తెలుస్తోంది.&;

ఢిల్లీ హైకోర్టు జడ్జిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన కొన్ని గంటల తర్వాత ఈ నివేదిక విడుదలైంది.జస్టిస్ వర్మకు ప్రస్తుతం ఎటువంటి న్యాయపరమైన పనిని అప్పగించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరినట్లు సుప్రీంకోర్టు ఓప్రకటన విడుదల చేసింది. 

ALSO READ | హైకోర్టు జడ్జి ఇంట్లో భారీగా నోట్లకట్టలు ..సుప్రీం ప్యానెల్ తో ఎంక్వైరీ

ఢిల్లీ హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. శుక్రవారం జస్టిస్ ఉపాధ్యాయ నిజనిర్ధారణ నివేదికను CJIకి సమర్పించిన తర్వాత కమిటీ నియామకంపై నిర్ణయం తీసుకున్నారు.ఈ కమిటీలో పంజాబ్ & హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జిఎస్ సంధవాలియా ,కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అను శివరామన్‌లతో  కమిటీని ఏర్పాటు చేశారు.