కాలుష్య నగరాల వివరాలు ఇవ్వాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

కాలుష్య నగరాల వివరాలు ఇవ్వాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: కాలుష్యం ‘పాన్‌‌ ఇండియా’ సమస్య అని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశంలోని అత్యంత కాలుష్య నగరాల లిస్ట్‌‌ను అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఢిల్లీ ఎన్‌‌సీఆర్‌‌‌‌లో గాలి నాణ్యతకు సంబంధించిన సమస్యలను గుర్తించి, పరిష్కరిస్తున్న కమిషన్‌‌ ఫర్‌‌‌‌ ఎయిర్‌‌‌‌ క్వాలిటీ మేనేజ్‌‌మెంట్‌‌ (సీఏక్యూఎం) తరహాలో అన్ని రాష్ట్రాలకు కూడా ఇలాంటి యంత్రాంగాన్ని రూపొందించాలని పేర్కొంది. 

ఈమేరకు జస్టిస్‌‌ అభయ్‌‌ ఎస్‌‌ ఓకా, జస్టిస్ మన్మోహన్‌‌ల బెంచ్‌‌ తీర్పు వెలువరించింది. ‘‘వాయు కాలుష్య సమస్య దేశవ్యాప్తంగా ఉంది. దీని కట్టడికి ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించవచ్చా.. లేదా.. అనే విషయాన్ని మాకు తెలియపర్చండి. సుప్రీంకోర్టులో కూర్చొని ఢిల్లీ వాయు కాలుష్యంపై మాత్రమే మేము చెబుతున్నామని తప్పుడు సంకేతాలు ఇవ్వకూడదు. అందుకే మేము ఈ సమస్యను దేశవ్యాప్తంగా విస్తరించాం” అని కోర్టు పేర్కొంది.