ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఇందులోభాగంగా ఈ క్రమంలో ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించాడు. దీంతో చార్జిషీట్ దాఖలు చేసినందున... బెయిల్ రద్దు పిటిషన్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది వెల్లడించారు.
ALSO READ | ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేదు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సీఎం
2023 సెప్టెంబర్ లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతికి పాల్పడినట్లు ఆరోపిస్తూ చంద్రబాబుని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నవంబర్ లో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు బెయిల్ రద్దు చెయ్యాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బుధవారం బెయిల్ రద్దు పిటీషన్ ని విచారించిన కోర్టు డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే అవసరమయిన సందర్భంలో విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు చంద్రబాబుకు సూచించింది.