వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామ దాఖలు చేసిన పిటీషన్ ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. ఈ పిటీషన్ పై గత కొంతకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్ వీడింది.. సోమవారం ( జనవరి 27, 2025 ) రఘురామ పిటిషన్ పై కీలక నిర్ణయం వెల్లడించింది సుప్రీంకోర్టు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. జగన్ కేసులు ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించిన సుప్రీం.. కేసులను మీరు పర్యవేక్షిస్తారా అంటూ అసహనం వ్యక్తం చేసింది.
జగన్ బెయిల్ రద్దుకు కారణాలు లేవని పేర్కొన్న సుప్రీం.. బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో చేసేదేమి లేక.. తమ పిటీషన్ ఉప సంహరించుకుంటున్నట్లు వెల్లడించారు రఘురామ తరపు న్యాయవాది. ఈ క్రమంలో బెయిల్ రద్దు పిటీషన్, కేసుల విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలనే పిటీషన్ల విషయంలో జగన్ కు బిగ్ రిలీఫ్ లభించిందని చెప్పాలి. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన జస్టిస్ నాగ రత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.
Also Read:-ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు బెయిల్..
గత 12ఏళ్లుగా జగన్ కేసులు ముందుకు కదలటం లేదన్న రఘురామ వాదనలపై జగన్, సీబీఐ వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఇవాళ కీలక నిర్ణయం వెల్లడించింది.. మొత్తానికి రఘురామ సుప్రీంకోర్టులో తన పిటిషన్లను ఉపసంహరించుకోవడంతో జగన్ బిగ్ రిలీఫ్ లభించిందని చెప్పాలి.