- మరో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న రఘురామకృష్ణరాజు
న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జగన్ కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
ఈ విషయంపై దాఖలైన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. అలాగే..ఆయన బెయిల్ ను రద్దు చేయాలన్న మరో పిటిషన్‌పై కూడా ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంపై దాఖలైన పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు పిటిషనర్‌కు అనుమతిచ్చింది.
అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు తెలంగాణ సీబీఐ కోర్టులో జరుగుతున్న కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో రెండు పిటిషన్‌లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లను జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర మిశ్రాతో కూడిన బెంచ్ సోమవారం విచారించింది. కారణాలేవీ లేనందున జగన్ బెయిల్‌ను రద్దు చేయాల్సిన అవసరం లేదని బెంచ్ స్పష్టం చేసింది.
అలాగే ఆయనకు సంబంధించిన కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయలేమని తెలిపింది. ఇప్పటికే ట్రయల్ జరుగుతోందని, అలాంటప్పుడు ట్రయల్ ను వేరే రాష్ట్రానికి మార్చాల్సిన అవసరం లేదని వివరించింది. బదిలీ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై కూడా ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని బెంచ్ చెప్పింది. దాంతో రఘురామ తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్..తన పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు బెంచ్ అనుమతిచ్చింది. జగన్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.