గృహ హింస చట్టం స్టేటస్పై సుప్రీం సీరియస్.. రాష్ట్రాలు, యూటీలకు ఫైన్

 గృహ హింస చట్టం స్టేటస్పై సుప్రీం సీరియస్.. రాష్ట్రాలు, యూటీలకు ఫైన్

న్యూఢిల్లీ: గృహ హింస చట్టం అమలుపై స్టేటస్ రిపోర్టులు దాఖలు చేయకపోవడంతో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు మందలించింది. రూ.ఐదు వేలు జరిమానా చెల్లించి 4 వారాల్లోగా స్టేటస్ రిపోర్టులు సబ్మిట్ చేయాలని జస్టిస్ బీవీ.నాగరత్న, జస్టిస్ ప్రసన్న బి. వరాలేతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. 

ఏపీ, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఎంపీ, మహారాష్ట్ర, మేఘాలయ, ఒడిశా,  బెంగాల్, అస్సాం రాష్ట్రాలు రిపోర్టులు సబ్మిట్ చేయలేదని పేర్కొంది. మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన గృహ హింస చట్టం–2025 అమలుకు సంబంధించి స్టేటస్ రిపోర్టులు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు 2024, డిసెంబర్ 2న ఉత్తర్వులిచ్చింది. 

ఆ రిపోర్టులను ఫిబ్రవరి14లోగా సబ్మిట్ చేయాలంటూ జనవరి 17న మరోసారి ఆదేశాలచ్చింది. కానీ, సుప్రీంకోర్టు ఉత్తర్వులను పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పట్టించుకోలేదు.