నీట్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నీట్ యూజీ ఎగ్జామ్స్ తిరిగి నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కాపీ కొట్టిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని తెలిపింది. హజారీబాగ్ , పాట్నాలో పేపర్ లీక్ అయింది.. దేశమంతా పేపర్ లీక్ అయినట్లు ఎలాంటి ఆధారాలు లేవని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. నీట్ పరీక్ష రద్దు చేస్తే 24లక్షల మంది విద్యార్థులపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. బీహార్ కు చెందిన 155 మందికి లబ్ది చేకూరిందని తెలిపింది. మద్రాస్ ఐఐటీ రిపోర్టు ను కూడా స్టడీ చేశాం..నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.
గత కొన్ని రోజులుగా నీట్ యూజీ పరీక్షల పేపర్ లీక్ పై దేశవ్యాప్తంగా దుమారం రేపింది. నీట్ యూజీ 2024 ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. నీట్ వివాదంతో డైరెక్టర్ జరనల్ సుబోధ్ కుమార్ సింగ్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ పదవినుంచి తొలగించారు. నీట్ పరీక్షా విధానాలపై ఇస్రో మాజీ చీఫ్ నేతృత్వంలో ఓ కమిటీని కూడా నియమించారు. అంతేకాదు కేసు విచారణను సీబీకి అప్పగించారు. బీహార్, ఉత్తర ప్రదేశ్ లనుంచి ఈ కేసుతో సంబంధమున్న పలువురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో మంగళవారం (జూలై 23) నీట్ పరీక్ష రద్దుపై పిటిషన్లను విచారణకు చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం నీట్ పరీక్ష తిరిగి నిర్వహించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.