![Mohan Babu: నటుడు మోహన్ బాబు కి ముందస్తు బెయిల్ మంజూరు.. ఎందుకంటే.?](https://static.v6velugu.com/uploads/2025/02/supreme-court-good-news-to-mohan-babu_wqiFl2UgKY.jpg)
టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబుకి స్ప్రెరేం కోర్టులో ఊరట లభించింది. అయితే ప్రముఖ టీవీ జర్నలిస్ట్ పై దాడి చేసిన కేసులో మోహన్ బాబు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. దీంతో మోహన్ బాబు గత ఏడాది డిసెంబర్ నెలలో హైకోర్టులో ముందస్తు బెయిల్ కి దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ధర్మాసనం ఈ బెయిల్ పిటీషన్ ని కొట్టివేసింది. దీంతో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టుని ఆశ్రయించాడు.
ఈ కేసుని గురువారం సుప్రీం కోర్టు విచారించింది. ఇందులోభాగంగా మోహన్ బాబు తరుపు న్యాయవాది ప్రస్తుతం విలేఖరి పరిస్థితిని కోర్టుకి వివరించాడు. అలాగే దడి అనంతరం బాధితుడికి ఆర్ధిక సహాయంతోపాటూ హాస్పిటల్ ఖర్చులు కూడా భరించినట్లు తెలిపాడు. దీంతో కోర్టు మోహన్ బాబుకి ముదనస్తు బెయిల్ ని మంజూరు చేసింది. గత కొనికొన్ని రోజులుగా ఫ్యామిలీ గొడవలు, ఆస్తి తగాదాలతో ఇబ్బంది పడుతున్న మోహన్ బాబుకి కొంతమేర ఊరట లభించిందని చెప్పవచ్చు.
ALSO READ : Prabhas: కన్నప్ప కోసం ప్రభాస్ షాకింగ్ రెమ్యునరేషన్.. నిజమేనా..?
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మోహన్ బాబు తెలుగులో కన్నప్ప అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది. అయితే దసరా మూవీ ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న "ది ప్యారడైస్" సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాని శ్రీకాంత్ ఓదెల అప్పట్లో సికింద్రాబాద్ ఏరియాలో జరిగిన ఓ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కస్తున్నాడు.