రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ ప్రముఖ హీరో దర్శన్ తూగుదీపగత ఏడాది పలు అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మీద జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఈ క్రమంలో షరతులతో కూడిన బెయిల్ బెంగళూరు హైకోర్టు మంజూరు చేసింది. దీంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం హీరో దర్శన్ బెయిల్ రద్దు చెయ్యాలంటూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
ఇందులోభాగంగా మొదటి ముద్దాయిగా ఉన్న వ్యక్తి అలాగే నిందితుడు హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తి కావడంతోకి బెయిల్ మంజూరు చెయ్యడంవలన సాక్షాలు తారుమారయ్యే అవకాశం ఉందని కాబట్టి దర్శన్ బెయిల్ ని రెడ్డి చెయ్యాలని ధర్మాసనాన్ని కోరారు.
ALSO READ | సైఫ్ అలీ ఖాన్ బ్లడ్ శాంపిల్స్, బట్టలు తీసుకున్న పోలీసులు.. ఎందుకంటే.?
కానీ సుప్రీం కోర్టు మాత్రం హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. అలాగే సరైన కారణాలు లేకుండా బెయిల్ ఆర్డర్స్ ని రద్దు చేయలేమని స్పష్టం చేసింది. కానీ ఈ బెయిల్ రద్దు అప్పీల్ ని మరోసారి సమీక్షిస్తామని సూచించింది. దీంతో హీరో దర్శన్ కి సుప్రీం కోర్టులో కొంతమేర ఊరట లభించిందని చెప్పవచ్చు.
ఈ విషయం ఇలా ఉండగా దర్శన్‌ను రేణుకా స్వామి అనే వ్యక్తిని దారుణంగా హతమార్చిన కేసులో జూన్ 11, 2024న అరెస్టు చేశారు. ఆ ఆతర్వాత నంవంబర్ లో బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. అయితే ఈ కేసులో దాదాపుగా 17మందిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇందులో ఇప్పటికే 12మంది బెయిల్ పై రిలీజ్ అయ్యారు. మిగిలినవారు బాలలీరి జైలులో రిమాండ్ లో ఉన్నారు.