కేజ్రీవాల్‍‌కు బెయిల్ వచ్చినా.. సీబీఐ కేసులో జైల్లోనే

ఢిల్లీ: సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఈ కేసులో విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. కేజ్రీవాల్ ను లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  

జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ జరిపింది. కేజ్రీవాల్, ఈడీ వాదనల అనంతరం మే 17న తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కామెంట్లు చేసింది. సీఎం కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి అని పేర్కొంది. అతను దాదాపు 90 రోజులు జైలు శిక్ష అనుభవించారని చెప్పింది. కాగా ఇవాళ షరతులతో కూడిన మధ్యంతరం బెయిల్ ను మంజూరు చేసింది. 

బెయిల్ వచ్చినా జైల్లోనే..

ఈడీ దాఖలు చేసిన పీఎంఎల్ఏ కేసులో సుప్రీకోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసినా ఆయన తీహార్ జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం లేదు. ఆయనను సీబీఐ కూడా అరెస్టు చేసింది. ఆ కేసులోనూ బెయిల్ మంజూరైతేనే కేజ్రీవాల్ బయటికి వస్తారు.

ALSO READ |  జూన్ 25ను సంవిధాన్ హత్యాదివాస్‌గా ప్రకటించిన కేంద్రం