ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఆయనకు సుప్రీమ్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కొన్ని నెలలుగా అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నారు కేజ్రీవాల్. ఈ కేసులో కింది కోర్టు బెయిల్ మంజూరు చేసినా.. ఆ బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు కేజ్రీవాల్. ఈ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం.
ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీమ్, కేసు విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్ అంశంలో పలు అంశాలపై సెక్షన్లను పరిశీలించాల్సి ఉందని తెలిపింది.అరెస్ట్ అక్రమమంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి బదిలీల చేస్తున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు.