ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటీషన్ ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని.. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలంటూ రెండు పిటీషన్లు దాఖలు చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈ పిటీషన్లు దాఖలు చేసి చాలా రోజులు అయ్యింది కూడా.. వీటిపై 2024, ఆగస్ట్ 21వ తేదీ విచారణ చేసిన న్యాయస్థానం.. కీలక నిర్ణయం తీసుకున్నది.
రాజకీయ కక్షలకు, సాధింపులకు కోర్టులు వేదిక కాదని.. వేదికలుగా మార్చొద్దంటూ పిటీషన్ దాఖలు చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని హెచ్చరించింది జస్టిస్ సుందరేష్ ధర్మాసనం. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలన్న పిటీషన్ ను.. అదే విధంగా సీబీఐతో విచారణ చేయాలన్న పిటీషన్ ను కూడా కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు.
Also Read :- రైలు బోగీలకు పుట్టగొడుగులు
చంద్రబాబు కడిగిన ముత్యం అని.. అతనిపై రాజకీయ కక్షతోనే కేసులు పెడుతున్నారని.. పిటీషన్లు వేస్తున్నారని.. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేస్తుందంటూ కామెంట్ చేస్తున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఏదిఏమైనా నోటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఇది వెరీ బిగ్ రిలీఫ్..