- శిక్షిస్తున్నంత మాత్రాన బాల్య వివాహాలు ఆగవు
- సమాజంలో అవగాహన కల్పించాలి: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: పర్సనల్ లాతో సంబంధం లేకుండా బాల్యవివాహాల నిరోధక చట్టాన్ని అమలుచేయాలని సుప్రీంకోర్టు సూచించింది. తల్లిదండ్రులు తమ పిల్లలు మైనర్లుగా ఉన్నప్పుడే పెండ్లిళ్లు, ఎంగేజ్మెంట్ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపింది. తమ భాగస్వాములను ఎంచుకునే స్వేచ్ఛను పేరెంట్స్ హరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. బాధ్యులను శిక్షిస్తున్నా.. బాల్య వివాహాలు మాత్రం ఆగడం లేదని పేర్కొంది.
బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈమేరకు కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. బాల్య వివాహాలతో కలిగే ఇబ్బందులపై సమాజంలో అవగాహన కల్పించాలని సూచించింది.