
చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను 2023 అక్టోబర్ 9 సోమవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి తన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఈ కేసులో 17 A అమలు కాలేదని చంద్రబాబు లాయర్లు వాదించగా, దీనిపై సమాధానం ఇచ్చేందుకు తమకు సమయం కావాలని సీఐడీ కోరడంతో వచ్చే సోమవారినికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారంలోపు తమకు కూడా సమర్పించాలని సీఐడీ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.