
ఎపి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు పిటీషన్పై దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు నేడు(2023 అక్టోబర్ 17, మంగళవారం) తుది తీర్పు వెల్లడించనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాష్ట్ర గవర్నర్ అనుమతి లేకుండా తనను అరెస్టు చేసి, రిమాండ్ కు పంపడాన్ని చంద్రబాబు సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివకే వాదనలు విన్న న్యాయస్తానం.. మరోసారి ఇరువర్గాల వాదనలు విననుంది.
2018 జూలైలో అవినీతి నిరోధక చట్టానికి పార్లమెంటు తీసుకొచ్చిన సెక్షన్ 17ఏ సవరణ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అన్న దానిపై ఇప్పటికే సుదీర్ఘంగా వాదనలు సాగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు లాయర్లు ఆయనకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని వాదిస్తుండగా.. ప్రభుత్వ న్యాయవాది మాత్రం వర్తించదని చెబుతున్నారు.
ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్వాసనం ఇరు వర్గాల తుది వాదనలు విని తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఎపి ప్రభుత్వం తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించిన అనంతరం చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ పాలే కౌంటర్ వాదనలు ప్రారంభించనున్నారు . ఇక, ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ పై సుప్రీం దర్మాసనం విచారించనుంది.