పోలవరంపై సుప్రీం విచారణ డిసెంబర్ 7కు వాయిదా

పోలవరంపై సుప్రీం విచారణ డిసెంబర్ 7కు వాయిదా
  • తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం
  • పోలవరంపై కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక కోరిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం.. భూముల ముంపుపై సుప్రీంకోర్టు విచారణ డిసెంబర్ 7కు వాయిదా పడింది. ఏపీ ప్రభుత్వం గోదావరి నదిపై చేపట్టిన పోలవరం ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు జరుగుతోందని అభ్యంతరాలు తెలుపుతూ తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన  సుప్రీంకోర్టు  త్రిసభ్య ధర్మాసనం.. పొలవరం ప్రాజెక్టుపై నివేదిక ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖను  కోరింది. అంతేకాకుండా పర్యావరణ అంశాలను పరిశీలించాలని కేంద్ర జలశక్తి శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలవరంపై తలెత్తుతున్న అభ్యంతరాలపై ముఖ్యమంత్రులు, చీఫ్ సెక్రటరీల స్థాయిలో చర్చలు జరపాలని సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.