లక్నో: జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. శివలింగం ఉన్న స్థానంలో మసీదును నిర్మించారని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. దీనిపై హిందూ వర్గం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా ఈ కేసులో ముస్లిం వర్గానికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. కాగా జ్ఞానవాపి కేసులో వారణాసి దిగువ కోర్టులో కొనసాగుతున్న మొత్తం 15 పిటిషన్లను హైకోర్టుకు బదిలీ చేయాలనే హిందూ పక్షం చేస్తున్న డిమాండ్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది.
ఈ వివాదానికి సంబంధించి కొన్ని పిటిషన్లు జిల్లా కోర్టులో ఉన్నాయని, కొన్ని సివిల్ కోర్టులో విచారణలో ఉన్నాయని హిందూ వర్గం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో ఒకే కేసుపై వేరు వేరు తీర్పులు వస్తున్నాయని తెలిపారు. కనుక జ్ఞానవాపికి సంబంధించిన అన్ని పిటిషన్లను అలహాబాద్ హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేయాలని కోరుతున్నామన్నారు.
ముస్లిం వర్గం తరపు న్యాయవాది వుజుఖానా వాదనలు వినిపిస్తూ.. సీల్డ్ ఏరియాలో ఏఎస్‌ఐ సర్వే చేయాలని హిందూ పక్షం కోరుతోంది. జిల్లా కోర్టు ఈ డిమాండ్‌ను తోసిపుచ్చగా, హైకోర్టు అనుమతించడంతో.. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. ఆ పిటిషన్‌పై నిర్ణయం ఇంకా పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు.