ఫేక్ న్యూస్ ప్రచారంపై ట్విట్టర్ కు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. ఫేక్ అకౌంట్స్ పై, విద్వేషపూరిత ఖాతాలపై , రెచ్చగొట్టే ట్వీట్స్ ఖాతాలను పర్యవేక్షించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రానికి, ట్విట్టర్ కు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. బీజేపీ నేత వినిత్ గోయెంకా గతేడాది మేలో పిటిషన్ దాఖలు చేశారు. ట్విట్టర్ కంటెంట్ , నకిలీ ఖాతాలు, ఫేక్ న్యూస్ , విద్వేష పూరిత మెస్సేజ్ లపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రముఖ వ్యక్తుల పేరిట ఉన్నటువంటి వందలాది ఫేక్ ట్విట్టర్ ఫేస్‌బుక్ అకౌంట్స్ పై చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్ లో కోరారు. సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు “ప్రత్యర్థుల ఇమేజ్ దెబ్బతీసేందుకు” ఉపయోగిస్తున్నారని..మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. ఇవాళ పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు ఫేక్ న్యూస్ ప్రచారాన్ని అడ్డుకోకపోవడంపై ట్విట్టర్, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
see more news
ఐపీఎల్ వేలంలో అర్జున్ టెండూల్కర్ కనీస ధర రూ. 20 లక్షలే
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Supreme Court issues notice to Centre, Twitter and others on a plea seeking a mechanism "to check Twitter content and advertisements spreading hatred through fake news and instigative messages through bogus accounts" pic.twitter.com/GZcbO9pkN4
— ANI (@ANI) February 12, 2021