ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్యను 1200 నుంచి 1500కి పెంచుతూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ అంశంపై మూడు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఈసీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఒకే పోలింగ్ స్టేషన్ లో 1500 మంది ఓటర్లు ఉంటే పరిస్థితిని ఎలా సమన్వయం చేస్తారని సీజేఐ సంజీవ్ ఖన్నా ఈసీని ప్రశ్నించారు.
Also Read : ఆ గ్రామంలో ప్రతి ఇంటికో హెలికాఫ్టర్
ఈసీ తరపున సీనియర్ అడ్వకేట్ మణింధర్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. 2019 నుంచి ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఈవిషయంలో అన్ని రాజకీయ పార్టీలను సంప్రదిస్తామని కోర్టుకు వివరించారు. ప్రతి బూత్ లో ఓటర్ల సంఖ్యను నిర్ణయించే ముందు పొలిటికల్ లీడర్ల సూచనలు తీసుకుంటామన్నారు. జస్టిస్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. " ఒక పోలింగ్ స్టేషన్ లో అనేక పోలింగ్ బూత్ లు ఉండొచ్చు, కానుక ఇది ఒకే బూత్ పోలింగ్ స్టేషన్ కు వర్తిస్తుందా?" అని ప్రశ్నించారు. కేసుకు సంబంధించి మూడు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది.