అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామిని సుప్రీంకోర్టు జడ్జి ఎస్వీఎన్ బట్టి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న జడ్జికి ఈవో పురేందర్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, అర్చకులు స్వాగతం పలికారు. ముందుగా గణపతిపూజ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో అభిషేకం నిర్వహించారు.
అనంతరం జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించారు. తీర్థప్రసాదాలు ఇచ్చి వేద ఆశీర్వచనాలను అందించారు. ఆయన వెంట జోగులాంబ గద్వాల జిల్లా జడ్జి కుష ఉన్నారు. డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రవిబాబు, ఎస్ఐ వెంకటస్వామి, తహసీల్దార్ మంజుల, ధర్మకర్తలు విశ్వనాథ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, గోపాల్ పాల్గొన్నారు.