న్యూఢిల్లీ: అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మెనార్టీ హోదాపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అలీఘర్ ముస్లిం యూనివర్శిటీకి మైనార్టీ హోదా ఉంటుందని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4:3 నిష్పత్తిలో 2024, నవంబర్ 8 శుక్రవారం ఈ తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 30 కింద అలీఘర్ ముస్లిం యూనివర్శిటీలో మైనార్టీలకు ప్రత్యేక హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా, 1875లో స్థాపించబడిన అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మైనార్టీ హోదాను పునరుద్ధరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.
ఈ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. 2024, ఫిబ్రవరి 1న తీర్పు రిజర్వ్ చేయగా.. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మైనార్టీ హోదా పునరుద్దరణపై 2024, నవంబర్ 8 శుక్రవారం తీర్పు వెలువరించింది. అలీఘర్ వర్శిటీకి మైనార్టీ హోదా సాధ్యం కాదని 1967 నాటి తీర్పును సుప్రీంకోర్టు 4:3 మెజారిటీతో తోసిపుచ్చింది. అలీఘర్ ముస్లిం యూనివర్శిటీకి మైనార్టీ హోదా ఉండటం సబబేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.