17ఏళ్ల పోరాటం.. తీర్పు చెప్పిన సుప్రీం

ఆమె పెద్ద గా చదువుకోలేదు. చాలా మామూలు ఇల్లాలు. 17 కిందట ఆమె గ్యాంగ్ రేప్ కు గురైంది. ఆమె కళ్లెదుటే 14 మంది కుటుంబ సభ్యులను చంపేశారు. పోలీసుల దగ్గరకు వెళితే కేసు పెట్టలేదు. అదేం అంటే ఆధారాల్లేవు పొమ్మన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ను అప్రోచ్ అయింది. సుప్రీంకోర్టు గడప తొక్కింది. అలుపెరుగని పోరాటం చేసింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నోబెదిరింపులు ఎదుర్కొంది. అయినా ఆమె వెనకడుగు వేయలేదు. చివరకు విజేతగా నిలిచింది. ఆమె …మరెవరో కాదు బిల్కీస్ బానో

బిల్కీస్ బానో గుజరాత్ కు చెందిన ఓ సాదా సీదా ఇల్లాలు. మానవ మృగాల క్రూరత్వానికి గురైన ఆడపడుచు. తనకు , తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఆమె 17 ఏళ్ల పాటు అలుపెరుగని పోరాటం చేసింది. చివరకు విజయాన్ని సాధించింది.గ్యాంగ్ రేప్ కు గురైన బిల్కీస్ కు రూ. 50 లక్షల పరిహారంతో పాటు సర్కారీ ఉద్యోగం, ఉండటానికి ఇల్లు ఏర్పాటు చేయాలని తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పుఇచ్చింది. ఆమె కోరుకున్న ప్రాంతంలో ఉండటానికి ఏర్పాట్లు చేయాలని సర్కార్ ను ఆదేశించింది. గతంలోబిల్కీస్ కు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి సర్కార్ ముందుకొచ్చినా ఆమె తీసుకోలేదు. తనకు న్యాయం జరిగే వరకు  పోరాటంచేస్తానని స్పష్టం చేసింది. చివరకు అంతిమ విజేతగానిలిచింది.

దారుణాన్ని వివరించడానికి పదాలు చాలవు
ప్రశాంతంగా నడుస్తున్న బిల్కీస్ జీవితం గోధ్రా సంఘటన తర్వాత చెలరేగిన అల్లర్లకు బలయ్యింది. బిల్కీస్ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరించడానికి డిక్షనరీలోని ఏ పదాలు సరిపోవు. బిల్కీస్ నుకేవలం ఒక మతానికి, ఒక ప్రాంతానికో పరిమితం చేయడం సరికాదు. బిల్కీస్ మన గల్లీలో ఉండే ఆడకూతురు లాంటిది. మన పక్కింటి అమ్మాయి లాంటిది.మంచీ చెడూ విచక్షణ కోల్పోయిన గుంపు ఆమెను గ్యాంగ్ రేప్ చేసింది. అల్లర్లలో బిల్కీస్ తన కుటుంబానికి చెందిన మొత్తం 14 మందిని కోల్పోయింది. ఆమె కళ్లెదుటే ఆ హత్యలన్నీ జరిగాయి. ఇంత జరిగినా బిల్కీస్ మనోధైర్యం కోల్పోలేదు. అక్షరం ముక్క చదువుకోకపోయినా పట్టు దలతో తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసింది. చివరకు సుప్రీం కోర్టు ఆమెకు న్యాయం చేసింది. గతంలో బిల్కీస్ కు ఐదు లక్షలరూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి సర్కారు ముందుకొచ్చినా, ఆమె తీసుకోలేదు. తనకు న్యాయం జరిగేవరకు న్యాయ పోరాటం కొనసాగిస్తానని స్పష్టంచేసింది. ఈ న్యాయ పోరాటంలో ఆమె భర్త యాకూబ్తో పాటు మరెంతో మంది ఆమెకు కొండంత అండగానిలిచారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత మీడియాతో మాట్లాడుతూ తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

కేసు వివరాలు
ప్రాసిక్యూషన్ కథనం మేరకు బిల్కీస్ బానోకేసు 2002 మార్చి నాటిది. అహ్మదాబాద్ కు దగ్గర్లోని దహోద్ జిల్లా రంధి కాపూర్ గ్రామానికి చెందిన ఆడపడుచు బిల్కీస్బానో. సంఘటన జరిగే నాటికి బిల్కీస్ బానోవయసు 19 ఏళ్లు. మూడేన్నరేళ్ల పాపకుతల్లి. అప్పటికి ఆమె ఐదు నెలల గర్భవతి. అల్లర్లకు భయపడి బిల్కీస్ బానో ఓ ట్రక్కులో17 మంది కుటుంబ సభ్యులతో కలిసి పారిపోతుండగా ఓ గుంపు దాడి చేసింది. బిల్కీస్ పై గ్యాం గ్ రేప్ కు పాల్పడింది. బిల్కీస్ చనిపోయిందనుకుని వదలిపెట్టి వెళ్లిపోయారు. ఈ సంఘటనలో బిల్కీస్ స్పృహ కోల్పోయింది. మూడు గంటల తర్వాత స్పృహలోనికి వచ్చింది. దగ్గర్లోని కొండ ప్రాంతంలోని ఓగిరిజన కుటుంబం, బిల్కీస్ ను అక్కున చేర్చుకుంది. జరిగిన దారుణంపై పోలీసులకు ఆమె కంప్లయింట్ చేసింది. అయితే ఏడాది తర్వాత తగిన ఎవిడెన్స్ లేదంటూ మేజిస్ట్రేట్ కేసు క్లోజ్ చేశారు. దీంతో బిల్కీస్ ‘నేషనల్హ్ హ్యూమన్ రైట్స్ కమిషన్’ను అప్రోచ్అయింది. న్యాయం కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. దీంతో కేసును సీబీఐకు సుప్రీంకోర్టు రిఫర్ చేసింది.

 

ముఖ్య ఘట్టాలు
మార్చి 3, 2002 : గోద్రా అల్లర్లు అహ్మదాబాద్ కు దగ్గరలోని రాధికాపూర్ వరకు వ్యాపించాయి. అల్లర్ల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ట్రక్కులో పారిపోతున్న బిల్కీస్ బానో కుటుంబంపై ఓ గుంపు దాడిచేసింది. బిల్కీస్ ను గ్యాంగ్ రేప్ చేసింది ఈగుంపు. ఆమె కుటుంబ సభ్యులు 14 మందిని హత్య చేసింది.

2002 –2003 : కేసు నమోదు చేసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. కేసుపెట్టడానికి సరైన సాక్ష్యాధారాలు లేవన్నారు. కేసు పెట్టాల్సిందేనని ఒత్తిడి తీసుకువస్తే తీవ్ర పరిణామాలు సంభవిస్తాయని బిల్కీస్ ను బెదిరించారు. దీంతో 2003 డిసెంబర్ లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ( ఎన్ హెచ్ ఆర్ సీ ) గడప తొక్కింది బిల్కీస్. న్యాయం చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ఆధారంగా కేసుపై విచారణ జరపాల్సిందిగా సీబీఐను సుప్రీంకోర్టు ఆదేశించింది.

జనవరి 2004 : బిల్కీస్ కంప్లయింట్ఆధారంగా నిందితులందరినీ సీబీఐ అరెస్టు చేసింది. కేసుకు అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించింది.

ఆగస్టు 2004 : బిల్కీస్ కోరిన మీదట కేసువిచారణను అహ్మదాబాద్ నుంచి ముంబైకు మార్చారు.

జనవరి 2004 : 13 మందిని దోషులుగా నిర్థారిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది. వీరిలో 11 మందికి యావజ్జీవ శిక్షపడింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూనిందితులు ముంబై హై కోర్టుకెళ్లారు.

జులై 2011 : దోషులుగా ట్రయల్ కోర్టు నిర్థారించిన వారికి మరణ శిక్ష విధించాలంటూ ముంబై హైకోర్టులో సీబీఐ పిటీషన్ వేసింది.

జులై 15, 2016 : యావజ్జీవ శిక్ష పడ్డ11మంది అప్పీళ్లపై ముంబై హై కోర్టువిచారణ ప్రారంభమైంది.

డిసెంబర్ 2016 : శిక్షపడ్డ 11 మందిఅప్పీళ్లపై తీర్పును ముంబై హై కోర్టు రిజర్వ్ చేసింది. దోషులుగా తేలిన మరో ముగ్గురికి మరణ శిక్ష విధించాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటీషన్ పై కూడా తీర్పు రిజర్వ్ చేసింది.

మే 2017 : ట్రయల్ కోర్టు విధించిన11 మందికి యావజ్జీవ శిక్ష ను ముంబైహై కోర్టు ఖరారు చేసింది.