సుప్రీంకోర్టులో కోర్ట్​ అసిస్టెంట్​ పోస్టులు

సుప్రీంకోర్టులో కోర్ట్​ అసిస్టెంట్​ పోస్టులు

గ్రూప్​–బి నాన్​గెజిటెడ్​ జూనియర్​ కోర్టు అసిస్టెంట్​పోస్టుల భర్తీకి సుప్రీంకోర్ట్​ ఆఫ్​ ఇండియా అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు మార్చి 8వ తేదీ వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టులు 241: జూనియర్ కోర్టు అసిస్టెంట్

ఎలిజిబిలిటీ: పోస్టులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్​వచ్చి ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, దివ్యాంగులకు 10 ఏండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్​ద్వారా.

అప్లికేషన్​ ఫీజు: రూ.1000, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్​ సర్వీస్​మెన్, మహిళా, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250.
లాస్ట్​డేట్: 2025, మార్చి 8.
సెలెక్షన్​ ప్రాసెస్: రాత పరీక్ష, టైపింగ్​ స్పీడ్​ టెస్ట్, 
ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.