తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశాలు

తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశాలు

ఢిల్లీ: తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో దర్యాప్తు జరగాలని స్పష్టం చేసింది. సీబీఐ నుంచి ఇద్దరు అధికారులను, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు,FSSAI నుంచి ఒకరితో దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

స్వతంత్ర దర్యాప్తు బృందం ఎవరెవరుంటారంటే..

* సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేసిన ఇద్దరు అధికారులు

* ఏపీ పోలీసు శాఖ నుంచి ఇద్దరు సీనియర్ అధికారులు

* ఫుడ్ సేఫ్టీ విభాగం నుంచి ఒక మోస్ట్ సీనియర్ ఆఫీసర్

దర్యాప్తు మొత్తం సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరగాలని సుప్రీం ఆదేశాలు

రాజకీయ ప్రేరేపితానికి, పొలిటికల్ డ్రామాలకు అవకాశం ఉండకూడదని సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు

ALSO READ సనాతన ధర్మాన్ని దూషించేవారికి కోర్టులు రక్షణ కల్పిస్తున్నాయి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..