ఎంక్వైరీ ఓకే  .. కమిషన్ చైర్మన్​ను మాత్రం మార్చండి : సుప్రీంకోర్టు

ఎంక్వైరీ ఓకే  .. కమిషన్ చైర్మన్​ను మాత్రం మార్చండి : సుప్రీంకోర్టు
  • విద్యుత్ కమిషన్​పై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
  • జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్​మీట్ పెట్టడంపై అభ్యంతరం 
  • ఈ నెల 22లోపు కొత్త చైర్మన్​ను నియమిస్తామన్న ప్రభుత్వం
  • కేసీఆర్ పిటిషన్​పై ముగిసిన విచారణ 

న్యూఢిల్లీ, వెలుగు: విద్యుత్ అక్రమాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ ను రద్దు చేయలేమని సుప్రీంకోర్టు తెలిపింది. కమిషన్ తన విచారణ కొనసాగించవచ్చని చెప్పింది. అయితే జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డిని మాత్రం మార్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయన మీడియా సమావేశం నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మీడియా సమావేశంలో జస్టిస్ నర్సింహారెడ్డి తన పరిధి దాటి మాట్లాడారని అభిప్రాయపడింది. విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలని, కమిషన్ చైర్మన్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, మీడియాకు లీకులు ఇస్తున్నారని గతంలో హైకోర్టులో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.

దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ‘మీడియా సమావేశం నిర్వహించారనే కారణంతో జస్టిస్ నర్సింహారెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహరించారనడం సరికాదు. కమిషన్ తన విచారణను కొనసాగించవచ్చు” అని తీర్పు ఇచ్చింది. కేసీఆర్ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసీఆర్ స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేశారు. దీనిపై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన బెంచ్‌ మంగళవారం విచారణ చేపట్టింది. కేసీఆర్‌‌‌‌‌‌‌‌  తరఫున సీనియర్‌‌‌‌‌‌‌‌  న్యాయవాది ముకుల్‌‌‌‌‌‌‌‌  రోహత్గీ, తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌‌‌‌‌‌‌‌  న్యాయవాదులు అభిషేక్‌‌‌‌‌‌‌‌  మనుసింఘ్వీ, సిద్ధార్థ్‌‌‌‌‌‌‌‌  లూథ్రా, కమిషన్‌‌‌‌‌‌‌‌  తరఫున సీనియర్‌‌‌‌‌‌‌‌  న్యాయవాది గోపాల్‌‌‌‌‌‌‌‌  శంకరనారాయణన్‌‌‌‌‌‌‌‌  సుదీర్ఘ వాదనలు వినిపించారు. 

కేసు మెరిట్స్​లోకి వెళ్లారు.. 

అన్ని పక్షాల వాదనలు విన్న బెంచ్.. కమిషన్‌‌‌‌‌‌‌‌  చైర్మన్‌‌‌‌‌‌‌‌  తన పరిధి దాటారనే అభిప్రాయానికి వచ్చింది. ‘‘కేసు మెరిట్స్‌‌‌‌‌‌‌‌ లోకి వెళ్లకుండా మీడియాకు చెప్తే తప్పులేదు. కానీ ఇక్కడ కమిషన్‌‌‌‌‌‌‌‌  కేసు మెరిట్స్‌‌‌‌‌‌‌‌ లోకి వెళ్లింది. అలాంటప్పుడు ఆ ప్రభావం విచారణను ఎదుర్కొనే వ్యక్తిపై పడుతుంది. వాళ్ల ఇమేజ్‌‌‌‌‌‌‌‌  దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒక కమిషన్‌‌‌‌‌‌‌‌  కు చైర్మన్‌‌‌‌‌‌‌‌  గా ఉన్న వ్యక్తి ప్రెస్‌‌‌‌‌‌‌‌ మీట్‌‌‌‌‌‌‌‌ లో వ్యక్తిగత అభిపాయాలు.. అదీ కమిషన్‌‌‌‌‌‌‌‌  విచారణ చేయబోయే వ్యవహారంపై చెప్పడం సరికాదు. ఇది కమిషన్‌‌‌‌‌‌‌‌  తన పరిధి దాటడమే అవుతుంది. న్యాయమూర్తి అయినా, కమిషన్‌‌‌‌‌‌‌‌  చైర్మన్‌‌‌‌‌‌‌‌  అయినా నిజాయతీగా ఉండటమే కాదు.. నిజాయతీగా కనిపించాలి” అని వ్యాఖ్యానించింది. విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డిని మార్చాలని ఆదేశించింది.

అయితే విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి రాజీనామా చేశారని విచారణ మధ్యలోనే కోర్టుకు ఆయన తరఫు లాయర్ గోపాల్ శంకరనారాయణన్ తెలిపారు. ఈ నెల 22లోపు కొత్త చైర్మన్‌‌‌‌‌‌‌‌ ను నియమిస్తామని ప్రభుత్వం తరఫు లాయర్ చెప్పారు. ఈ క్రమంలో స్పందించిన బెంచ్.. ‘‘కమిషన్ యథావిధిగా తన విచారణను కొనసాగించవచ్చు. ఇప్పటి వరకు జరిగిన విచారణ దగ్గరి నుంచే తదుపరి విచారణ కొనసాగించవచ్చు. కొత్త చైర్మన్‌‌‌‌‌‌‌‌ ను నియమించే అధికారం రాష్ట్రానికే అప్పగిస్తున్నం. ఇంతటితో ఈ పిటిషన్ పై విచారణ ముగిస్తున్నం” అని తీర్పు ఇచ్చింది.  

రాజకీయ కక్షసాధింపే: రోహత్గీ 

రాజకీయ కక్షసాధింపులో భాగంగానే విద్యుత్‌‌‌‌‌‌‌‌  కమిషన్‌‌‌‌‌‌‌‌  ఏర్పాటు చేశారని కేసీఆర్‌‌‌‌‌‌‌‌  తరఫు లాయర్ ముకుల్‌‌‌‌‌‌‌‌  రోహత్గీ వాదించారు. ‘‘తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. తొలినాళ్లలో విద్యుత్‌‌‌‌‌‌‌‌  సమస్య తీవ్రంగా ఉండేది. అత్యవసర పరిస్థితుల్లో పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్‌‌‌‌‌‌‌‌  కొనుగోలు చేయాల్సి వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో చత్తీస్‌‌‌‌‌‌‌‌  గఢ్‌‌‌‌‌‌‌‌  తో పవర్‌‌‌‌‌‌‌‌  పర్చేస్‌‌‌‌‌‌‌‌  అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌  చేసుకున్నారు. అది పూర్తిగా చట్టబద్ధంగా జరిగింది. అప్పుడున్న మార్కెట్‌‌‌‌‌‌‌‌  ధర కంటే తక్కువకే యూనిట్ రూ.3.90కు విద్యుత్‌‌‌‌‌‌‌‌  కొనుగోలు చేశారు” అని కోర్టుకు చెప్పారు.

అయితే ఓపెన్‌‌‌‌‌‌‌‌  బిడ్డింగ్‌‌‌‌‌‌‌‌  కు ఎందుకు వెళ్లలేదని కోర్టు ప్రశ్నించగా.. అత్యవసర సమయాల్లో టెండర్లు లేకుండా విద్యుత్‌‌‌‌‌‌‌‌  కొనుగోలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని రోహత్గీ సమాధానమిచ్చారు. ఎన్నికలకు ముందే ప్రస్తుత సీఎం ఆర్టీఏ ద్వారా అనేక సమాచారాలు సేకరించి పెట్టుకున్నారని, వాటి ఆధారంగా కక్షసాధింపు ధోరణితో ఇప్పుడు కమిషన్‌‌‌‌‌‌‌‌  వేశారని ఆరోపించారు. ‘‘ఎంక్వయిరీ కమిషన్‌‌‌‌‌‌‌‌  యాక్ట్‌‌‌‌‌‌‌‌ –1952 ప్రకారం జ్యుడీషియల్‌‌‌‌‌‌‌‌  కమిషన్‌‌‌‌‌‌‌‌  ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అది చట్ట వ్యతిరేకం. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్‌‌‌‌‌‌‌‌  కొనుగోలు ఒప్పందాలపై వివాదాలు ఏర్పడితే.. రాజ్యాంగబద్ధ సంస్థలే విచారణ చేపట్టాలి. కమిషన్ విచారణ చెల్లదు. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్లు, ట్రిబ్యునల్స్ ను కాదని ప్రభుత్వం ఏకపక్షంగా కమిషన్ ను ఏర్పాటు చేసింది. దాన్ని రద్దు చేయాలి” అని కోరారు. 

రూల్స్ ప్రకారమే విచారణ: సింఘ్వీ 

కమిషన్‌‌‌‌‌‌‌‌  ఎక్కడా తన పరిధి దాటలేదని, నిబంధనల ప్రకారమే పని చేస్తున్నదని ప్రభుత్వం తరఫు లాయర్ అభిషేక్‌‌‌‌‌‌‌‌  మనుసింఘ్వీ కోర్టుకు తెలిపారు. ‘‘గత ఏప్రిల్‌‌‌‌‌‌‌‌  11న కేసీఆర్‌‌‌‌‌‌‌‌  తో పాటు మిగిలిన వారికి కమిషన్‌‌‌‌‌‌‌‌  నోటీసులు ఇచ్చింది. పార్లమెంట్‌‌‌‌‌‌‌‌  ఎన్నికల వల్ల జూన్‌‌‌‌‌‌‌‌  30 వరకు సమయం కావాలని కేసీఆర్‌‌‌‌‌‌‌‌  కోరగా, జూన్‌‌‌‌‌‌‌‌  15లోగా సమాధానం ఇవ్వాలని కమిషన్‌‌‌‌‌‌‌‌  గడువు ఇచ్చింది. జున్‌‌‌‌‌‌‌‌  11న జస్టిస్‌‌‌‌‌‌‌‌  నర్సింహారెడ్డి మీడియాతో కేవలం విచారణ ఎంతవరకు వచ్చిందనే విషయాలు మాత్రమే చెప్పారు. కానీ దానిపై పిటిషన్లు వేసి విచారణను అడ్డుకోవాలని పిటిషనర్ చూస్తున్నారు” అని అన్నారు. జస్టిస్ నర్సింహారెడ్డి తరఫు లాయర్ గోపాల్‌‌‌‌‌‌‌‌  శంకర నారా యణన్‌‌‌‌‌‌‌‌  వాదిస్తూ.. ‘‘జస్టిస్‌‌‌‌‌‌‌‌  నర్సింహారెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహరించలేదు. రికార్డులో ఉన్న విషయాలేవీ మీడియాతో చర్చించలేదు” అని చెప్పారు.