ప్రజాభద్రతే ముఖ్యం..మతపరమైన నిర్మాణాలు తొలగించాల్సిందే: సుప్రీంకోర్టు

ప్రజాభద్రతే ముఖ్యం..మతపరమైన నిర్మాణాలు తొలగించాల్సిందే: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ:మతపరమైన నిర్మాణాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పును చెప్పింది. బుల్డోజర్ , ఆక్రమణ వ్యతిరేక కార్యకలాపాలపై తాము ఇచ్చిన ఆదేశాలు మతాలకు  సంబంధం లేకుండా అందరికి సమానంగా వర్తిస్తుందని చెప్పింది. 

రహదారులు, జలవనరులు, రైల్వే లైన్లు ఆక్రమించే మతపరమైన నిర్మాణాల కంటే ప్రజా భద్రతే ముఖ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేరస్థులపై బుల్డోజర్ చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ క్రమంలో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ శిశ్వనాథన్ లపో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 
ఆలయం అయినా, దర్గా అయినా సరే వాటికంటే ప్రజాభద్రలే ముఖ్యం అని జస్టిస్ గవాయ్ వెల్లడించారు. మరోవైపు వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్నా.. వారికి సంబంధించిన కట్టడాలను కూల్చేవేయడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. అయితే కొన్ని మతాల వారినే టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.

Also Read :- నేనెందుకు రాజీనామా చేయాలి?

అత్యాచారం, ఉగ్రవాదం వంటి తీవ్రమైన నేరాలతోపాటు ఏ కేసులో అయినా నిందితుడిగా ఉన్నప్పటికీ బుల్డోజర్ చర్యలు సరైనవి కాదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. 

వివిధ రాష్ట్రాల్లో బుల్డోజర్ చర్యలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ఇప్పటికే విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. సెప్టెంబర్ 17న కోర్టు అనుమతి లేకుండా దేశంలో ఆస్తుల కూల్చివేతలు చేపట్టరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

ప్రజా రహదారులు, ఫుట్ పాత్ లు, రైల్వే లైన్లు  లేదా ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఆక్రమణలకు ఈ ఉత్తర్వులు వర్తించవని సుప్రీంకోర్టు తెలిపింది.