ప్రబీర్ పుర్కాయస్థని విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశం

న్యూస్ క్లిక్ వార్తా సంస్థ వ్యవస్థాపకుడు, ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థను గతేడాది అక్టోబర్ లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్‌తోపాటు చైనాకు అనుకూలంగా వార్తలు రాశారని యాంటీ టెర్రరిజం యాక్ట్ UAPA చట్టం కింద ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం (మే 15) వెంటనే ఆయన్ని విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రబీర్ అరెస్ట్ చట్ట విరుద్ధమని బుధవారం సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రకటించింది. ఢిల్లీ పోలీసులు ఈ కేసులో రిమాండ్ రిపోర్ట్ అందించడంలో ఫేల్ అయ్యారని, తక్షణమే ప్రబీర్ పుర్కాయస్థని బెయిల్ పై విడుదల చేయాలని కోర్టు నిర్ణయించింది. 

భారత్ పై అసంతృప్తిని రెచ్చగొట్టడానికి చైనా నుంచి నిధులు పొందినట్లు, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయడానికి పీపుల్స్ అలయన్స్ ఫర్ డెమోక్రసీ అండ్ సెక్యులరిజంతో కలిసి పుర్కాయస్థ కుట్ర పన్నారని కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.  ప్రబీర్ ఆఫీసుల్లో, సన్నిహితుల ఇళ్లల్లో దాడులు కూడా నిర్వహించి అనేక పత్రాలు, డిజిటల్​ సాధనాలను స్వాధీనం చేసుకున్నారు.ఆయన అరెస్ట్ ను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇది అప్రజాకస్వామ్యమని పేర్కొంది.