ఆక్రమించిన వారి నుంచి డబ్బు రికవరీ చేయండి

ఆక్రమించిన వారి నుంచి డబ్బు రికవరీ చేయండి
  • ఆ డబ్బును సొసైటీకి ఇప్పించండి
  • రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
  • కల్యాణ్‌‌‌‌ నగర్‌‌‌‌  కోఆపరేటివ్‌‌‌‌ హౌసింగ్‌‌‌‌ సొసైటీ కేసులో తీర్పు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: కల్యాణ్‌‌‌‌ నగర్‌‌‌‌  కో-ఆపరేటివ్‌‌‌‌  హౌసింగ్‌‌‌‌  సొసైటీ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 1964లో హైదరాబాద్  యూసుఫ్‌‌‌‌గూడ విలేజ్‌‌‌‌లోని సర్వే నంబరు 128/1, 128/10లో 38 ఎకరాల భూమిని కల్యాణ్​ నగర్  కోఆపరేటి సొసైటీ కొనుగోలు చేయగా, ఆ భూమి 1972 నుంచి అక్రమణలకు గురవుతూ వచ్చింది. కార్మికనగర్ కు చెందిన వారు ఆ భూమిని ఆక్రమించారు. ఆ ఆక్రమణలపై 1988లో సంబంధిత హౌసింగ్‌‌‌‌  సొసైటీ.. జేటీ గౌడ్‌‌‌‌తో పాటు 502 మందిపై భూవివాదాల కోర్టులో కేసు వేయగా.. కార్మికనగర్ వాసులకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

 దీంతో కల్యాణ్‌‌‌‌  నగర్‌‌‌‌  కోఆపరేటివ్‌‌‌‌  సొసైటీ సభ్యులు 1997లో హైకోర్టులో రిట్‌‌‌‌  పిటిషన్‌‌‌‌  దాఖలు చేయగా.. ల్యాండ్‌‌‌‌  ఆక్విజిషన్‌‌‌‌  యాక్ట్‌‌‌‌ 2013 ప్రకారం సొసైటీకి నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ జీహెచ్‌‌‌‌ఎంసీ.. సుప్రీంకోర్టులో అప్పీల్‌‌‌‌  చేసింది. ఈ కేసును ప్రభుత్వం, జీహెచ్‌‌‌‌ఎంసీ తరపున సీనియర్‌‌‌‌  న్యాయవాదులు ఐశ్వర్య భాటి, మేనక గురుస్వామి వాదించారు. హైకోర్టు ఆదేశాలను  అమలు చేసినౖట్లెతే రాష్ట్ర ఖజానాపై రూ.2 వేల కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. 

వారి వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కల్యాణ్​ నగర్  సొసైటీ భూమిని ఆక్రమించిన వారి నుంచి పరిహారం వసూలు చేసి ఆ మొత్తాన్ని సొసైటీకి చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది కాకుండా ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటారా? అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఏం నిర్ణయం తీసుకున్నారో ఈ ఏడాది జులై 
24 వరకు తెలియజేయాలని జీహెచ్ఎంసీని సుప్రీంకోర్టు ఆదేశించింది.