జెట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్ ఆస్తులను అమ్మండి: సుప్రీం కోర్టు ఆదేశాలు

జెట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్ ఆస్తులను అమ్మండి: సుప్రీం కోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: కార్యకలాపాలు నిలిపివేసిన జెట్​ఎయిర్​వేస్ ​ ఆస్తులను అమ్మాలని సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది.   జెట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్  రిజల్యూషన్ ప్లాన్‌‌‌‌‌‌‌‌ను సమర్థిస్తూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీలాట్) తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నాయకత్వంలోని బెంచ్​తోసిపుచ్చింది.

దాని యాజమాన్యాన్ని జలాన్ కల్రాక్ కన్సార్టియం (జేకేసీ)కి బదిలీ చేయడానికి అంగీకరించలేదు. జేకేసీకి అనుకూలంగా జెట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్  రిజల్యూషన్ ప్లాన్‌‌‌‌‌‌‌‌ను సమర్థించిన ఎన్సీలాట్​ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎస్​బీఐ, ఇతర లెండర్లు చేసిన అభ్యర్థనను కోర్టు ఆమోదించింది.