
- ఈ కోటా కింద అడ్మిషన్స్ఆర్టికల్14ను ఉల్లంఘించినట్టే
- దేశంలో ప్రజలు ఎక్కడైనా జీవించొచ్చు.. ఎక్కడైనా చదువుకోవచ్చు
- రాష్ట్ర కోటాలో నీట్మెరిట్ఆధారంగానే సీట్లను భర్తీ చేయాలని ఆదేశం
న్యూఢిల్లీ: పీజీ వంటి ఉన్నత వైద్య విద్య కోర్సుల రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. పీజీ మెడికల్ కోర్సుల్లో నివాస ఆధారిత రిజర్వేషన్లను (డొమిసిల్బేస్డ్రిజర్వేషన్స్) రద్దు చేసింది. రాష్ట్ర కోటా కింద పీజీ సీట్ల కేటాయింపులో అనుసరిస్తున్న ఈ పద్ధతి ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తున్నదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. ఈ మేరకు బుధవారం జస్టిస్ హృషికేశ్‌రాయ్, జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ ఎస్వీఎన్భట్టితో కూడిన ముగ్గురు సభ్యుల బెంచ్ తీర్పు ఇచ్చింది. ‘‘మనమందరం భారతీయులమే.
దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు మనందరికీ ఉన్నది. దేశంలోని ఏ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లోనైనా చదువుకునే రైట్ను మనకు రాజ్యాంగం ప్రసాదించింది. దేశంలో ఎక్కడైనా ఉద్యోగం, వ్యాపారం చేసుకునే హక్కు ఉంది’’ అని బెంచ్ వెల్లడించింది. రాష్ట్ర కోటాలో పీజీ మెడికల్ అడ్మిషన్లు నీట్ పరీక్షలో మెరిట్ ప్రాతిపదికన మాత్రమే జరగాలని స్పష్ట చేసింది.
భవిష్యత్తు అడ్మిషన్లకు మాత్రమే..
తాము ఇచ్చిన తీర్పు భవిష్యత్తులో చేపట్టబోయే అడ్మిషన్లకు మాత్రమే వర్తిస్తుందని బెంచ్పేర్కొన్నది. ఇప్పటికే నివాసం ప్రాతిపదికన మంజూరు చేసిన రిజర్వేషన్లకు వర్తించదని పేర్కొన్నది. పీజీ కోర్సులు చదువుతున్న విద్యార్థులు, ఇప్పటికే ఉత్తీర్ణులైన వారిపై ఈ తీర్పు ప్రభావం ఉండబోదని క్లారిటీ ఇచ్చింది. నీట్పీజీ మెడికల్ అడ్మిషన్లలో డొమిసిల్బేస్డ్ రిజర్వేషన్స్ రాజ్యాంగ విరుద్ధమని పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కొందరు స్టూడెంట్స్ చేసిన అప్పీళ్లను విచారించిన సుప్రీంకోర్టు.. ఈ తీర్పు వెలువరించింది.
ఉద్యోగాల భర్తీలో అభ్యర్థులు నోటిఫికేషన్‌కు కట్టుబడాల్సిందే నిబంధనల్లో సడలింపులను కోరొద్దు: హైకోర్టు తీర్పు
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చే నోటిఫికేషన్ లోని నిబంధనలకు అభ్యర్థులు కట్టుబడి ఉండాలని.. ఆ నిబంధనల్లో సడలింపులు కోరడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. గిరిజన సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ తేదీ నాటికి ఇన్‌కమ్ సర్టిఫికెట్ ను అందజేయాల్సిందేనని వెల్లడించింది. నోటిఫికేషన్ తేదీ నాటికి ఆదాయపు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించకుండా ఆ తరువాత సంవత్సరంలో అనుమతించాలంటూ వేసిన అప్పీల్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్పు చెప్పింది.
గిరిజన సంక్షేమ శాఖలోని పోస్టుల భర్తీ కోసం టీజీపీఎస్సీ 2022లో వెలువరించిన నోటిఫికేషన్‌లో తాత్కాలిక సెలక్షన్ లిస్టును 2024లో విడుదల చేసింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–2 పోస్టుకు దరఖాస్తు చేసిన సిద్దిపేటకు చెందిన కె.తిరుపతి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం 2022–23, 2023–24 ఏడాదులకు సమర్పిస్తే, వాటిని టీజీపీఎస్సీ నిరాకరించింది. దీనిని సవాల్ చేస్తూ తిరుపతి వేసిన పిటిషన్‌ను గతంలో సింగిల్ జడ్జి డిస్మిస్ చేశారు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ వేసిన అప్పీల్‌ను జస్టిస్ అభినందకుమార్ షావిలి, జస్టిస్ ఎ. లక్ష్మీనారాయణ ధర్మాసనం బుధవారం విచారించింది.
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను ప్రస్తుత సంవత్సరాలకే జారీ చేయాలని, గత ఏడాదికి విడుదల చేయరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని పిటిషనర్ న్యాయవాది చెప్పారు. దీనిపై టీజీపీఎస్సీ అడ్వకేట్ వాదిస్తూ, రిజర్వేషన్లకు దరఖాస్తు చేసుకున్నవారందరూ 2021–22 సర్టిఫికెట్ సమర్పించారని తెలిపారు. జీవోలు 243, 244, 65 ప్రకారం సర్టిఫికెట్ సమర్పించాలని నోటిఫికేషన్‌లోనే ఉందన్నారు.