సుప్రీం కోర్టులో షర్మిలకు ఊరట..

వివేకా హత్యకేసు విషయంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు ఊరట లభించింది. ఎన్నికల ప్రచార సమయంలో వివేకా హత్య కేసు విషయంలో జగన్, అవినాష్ రెడ్డిల ప్రస్తావన తేవద్దంటూ కడప కోర్టు,ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీమ్ కోర్టు స్టే విధించింది. అయితే, ఎన్నికల తర్వాత సుప్రీమ్ కోర్టు ఉత్తర్వులు జారీ చేయటం షర్మిలకు పెద్దగా లాభం లేకపోయింది. ఎన్నికల ప్రచార సమయంలో వివేకా హత్యకేసు విషయంలో జగన్, అవినాష్ రెడ్డిల పేర్లు ప్రస్తావిస్తూ పదేపదే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ కోర్టును ఆశ్రయించగా షర్మిల, సునీత, పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీమ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు షర్మిల, సునీత. ఈ ప్తిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఈ సుప్రీమ్ కోర్టు నిర్ణయం వల్ల షర్మిల, సునీతలకు పెద్దగా ప్లస్ అయ్యేది ఏమీ లేదనే చెప్పాలి.