వేదాంత, అదానీ, సోని వంటి టాప్ కంపెనీలు రూ.30 వేల కోట్ల ట్యాక్స్ కట్టాల్సిందే: సుప్రీం కోర్టు తీర్పు

వేదాంత, అదానీ, సోని వంటి టాప్ కంపెనీలు రూ.30 వేల కోట్ల ట్యాక్స్ కట్టాల్సిందే: సుప్రీం కోర్టు తీర్పు

న్యూఢిల్లీ: వేదాంత, వొడాఫోన్ ఐడియా, అదానీ  ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌, సోని, శామ్‌‌‌‌సంగ్‌‌‌‌, కెనాన్‌‌‌‌ ఇండియా బిజినెస్‌‌‌‌లు వంటి టాప్ కంపెనీలకు సుప్రీం కోర్టు గురువారం షాకిచ్చింది.  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌‌‌‌ (డీఆర్‌‌‌‌‌‌‌‌ఐ) 2006 నుంచి  ఇష్యూ చేసిన ట్యాక్స్ నోటీసులు చెల్లుబాటు అవుతాయని, డీఆర్‌‌‌‌‌‌‌‌ఐకి ఈ పవర్ ఉందని తాజాగా తీర్పిచ్చింది. దీంతో ఈ కంపెనీలు పెండింగ్‌‌‌‌లో ఉన్న  సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల కోట్ల ట్యాక్స్‌‌‌‌ను కట్టాల్సి ఉంటుంది. 

షోకాజ్ నోటీసులను ఇష్యూ చేసి, డ్యూటీలను వసూలు చేసే అధికారం డీఆర్‌‌‌‌‌‌‌‌ఐ అధికారులకు ఉందని  కోర్టు  పేర్కొంది. 2006 సవరణ తర్వాత డీఆర్‌‌‌‌‌‌‌‌ఐ అధికారాలు తగ్గిపోయాయి. చాలా షాకాజ్ నోటిసుల వ్యాలిడిటీ పోయింది. దీనికి వ్యతిరేకంగా 2021 లో  ప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళ్లింది. తాజాగా తీర్పు వచ్చింది.