
న్యూఢిల్లీ, వెలుగు: ఓటుకు నోటు’వ్యవహారంలో చంద్రబాబుపై దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఏప్రిల్‌లో ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని తెలిపింది. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు పాత్రపై నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలని 2018లో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై బుధవారం జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై స్పందించేందుకు తమకు మరికొంత సమయం కావాలని ప్రతివాది రేవంత్ రెడ్డి తరఫు లాయర్లు బెంచ్‌ను కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది.