న్యాయవ్యవస్థపై ఆరోపణలా?..సీబీఐ అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యాయవ్యవస్థపై ఆరోపణలా?..సీబీఐ అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

పశ్చిమ బెంగాల్ కోర్టులపై సీబీఐ చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 20, 2024 శుక్రవారం నాడు 2021 ఎన్నికల అనంతరం హింస కేసులను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు పశ్చిమ బెంగాల్ కోర్టులపై సీబీఐ చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టుకు  ఆగ్రహం తెప్పించాయి. 

న్యాయవ్యవస్థపై కేంద్ర దర్యాప్తు సంస్థ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందని న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, పంకజ్ మిథాల్ లతో కూడిన ధర్మాసనం సీబీఐ పిటిషన్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది. 

పశ్చిమ బెంగాల్ కోర్టుల్లో న్యాయ విచారణ సరిగ్గా జరగడం లేదని..హింసాకాండకు సంబంధించిన 45 కేసులున్నాయి.. వాటిని పశ్చిమబెంగాల్ వెలుపల విచారిం చేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ.. సుప్రీంకోర్టును కోరింది.. 

Also Read  :- నీట్ కౌన్సెలింగ్‌లో తెలంగాణ విద్యార్థులకు ఊరట

సీబీఐ అభ్యర్థనపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం..బెంగాల్ కేసులను బదిలీ చేస్తే  కోర్టులు శత్రువులే అని ధృవీకరించినట్లు అవుతుంది. మరోవైపు పిటిషన్ లో పశ్చిమ బెంగాల్ కోర్టులపై సీబీఐ ఉపయోగించిన భాషపై , ఆఫిడవిట్ దాఖలు చేరసిన అధికారిపై కోర్టు ధిక్కారు నోటీసును ఎందుకు జారీ చేయకూడదో చెప్పాలని ప్రశ్నించింది. 

పశ్చిమ బెంగాల్‌లోని అన్ని కోర్టులపైనా కుంభకోణ ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో ప్రతికూల వాతావరణం నెలకొని ఉందని పదే పదే చెబుతున్నా.. సీబీఐ లాంటి కేంద్ర ఏజెన్సీలు ఈ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒక నిర్ధిష్ట రాష్ట్రం పట్ల అధికారులకు అనుకూలమైన దృక్పథం లేకపోవచ్చు..కానీ న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచాలని  సుప్రీంకోర్టు బెంచ్ సూచించింది.