బుల్డోజర్తో కూల్చిన ప్రతి ఇంటికీ రూ.10 లక్షల పరిహారం ఇవ్వండి.. సుప్రీం కోర్టు ఆదేశం

బుల్డోజర్తో కూల్చిన ప్రతి ఇంటికీ రూ.10 లక్షల పరిహారం ఇవ్వండి.. సుప్రీం కోర్టు ఆదేశం

ఉత్తర ప్రదేశ్ ప్రయాగరాజ్ లో కూల్చిన ప్రతి ఇంటికీ పది లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని సుప్రీం కోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రయాగరాజ్ లో లాయర్, ప్రొఫెసర్ తో పాటు ఇతర ముగ్గురి ఇండ్లను కూల్చిన కేసులో సుప్రీం కోర్ట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ చర్య చట్టవిరుద్ధం అని మండిపడింది. ఈ రకమైన కేసులలో ప్రతి కుటుంబానికి ఆరు వారాల్లో 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. 

జస్టిస్ అభయ్ ఎస్ ఓక, ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. పౌరుల ఇళ్లను ఇంత దారుణంగా కూల్చడం చట్టవిరుద్ధమని మండిపడింది. ఆర్టికల్ 21 లో భాగంగా నివాసం కలిగి ఉండటం పౌరుల హక్కు అని, ఆ విషయాన్ని డెవలప్ మెంట్ అథారిటీ గుర్తుంచుకోవాలసి సూచించింది. ఇలాంటి నిర్ణయాలు ప్రజల్లో తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయని చెప్పింది. 

2023 లో ప్రభుత్వం కొన్ని బుల్ డోజర్లతో కూల్చడం అప్పట్లో సంచలనం రేపింది. గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కు చెందిన ఇళ్లు అని, ఉద్దేశంతో ప్రభుత్వం కూల్చడం జరిగిందని, పిటిషనర్ పేర్కొన్నాడు.