దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (SCI).. 241 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సుప్రీంకోర్టులో ఉద్యోగాలంటే.. పెద్ద పెద్ద చదువులు అవసరమేమో అనే ఆలోచనలు వద్దు. ఏదేని విభాగంలో డిగ్రీ పాసయ్యుంటే చాలు. కాకపోతే, ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలి. ఇది సమస్యే కాదు. ఇప్పుడు టైపింగ్ నేర్చుకోవడానికి వెళ్లినా.. మీరు నెల రోజుల్లో ప్రావీణ్యులైపోతారు. ఉద్యోగం సాధిస్తే లైఫ్ సెటిలైనట్టే. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. చివరి తేదీ.. 08 మార్చి 2025.
జూనియర్ కోర్ట్ అసిస్టెంట్: 241 పోస్టులు
విద్యార్హతలు:
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదేని స్ట్రీమ్‌లో డిగ్రీ పాసై ఉండాలి.
- 35 WPM(వర్డ్స్ పర్ మినిట్)తో ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం.
వయోపరిమితి: 08/ 03/ 2025 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కలదు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ EWS/ ఓబీసీలు రూ. 1000/-.. SC/ ST/ PH రూ. 250/- దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
పరీక్షా కేంద్రాలు: లక్నో, ఢిల్లీ, పాట్నా, జైపూర్, అహ్మదాబాద్, అంబాలా, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, ఎర్నాకులం, గౌహతి, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, విశాఖపట్నం.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష
- కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్
- టైపింగ్ టెస్ట్
- ఇంటర్వ్యూ
- ధృవపత్రాల పరిశీలన
- మెడికల్ టెస్ట్
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 05 ఫిబ్రవరి 2025
దరఖాస్తులకు చివరి తేదీ: 08 మార్చి 2025
-
నోటిఫికేషన్ కోసం ఇక్కడ Notification క్లిక్ చేయండి.
-
దరఖాస్తు చేయడానికి ఇక్కడ Apply Online క్లిక్ చేయండి.