న్యూఢిల్లీ, వెలుగు:రాష్ట్రంలోని కోర్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ఫాస్ట్ ట్రాక్ (జిల్లా కోర్టులు అండ్ ట్రిబ్యునల్స్) కోర్టుల్లో పని చేసే 174 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరణ అంశంలో అడ్డంకులు తొలగిపోయాయి.
కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గతంలో ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీనిని పలువురు కాంట్రాక్ట్ ఉద్యోగులు హైకోర్టులో సవాల్ చేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు..అన్ని అర్హతలున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఉత్తర్వులిచ్చింది.
ఈ తీర్పుపై ధాఖలైన సవాల్ పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. హైకోర్టు తీర్పును సమర్థించి పిటిషన్ ను కొట్టివేసింది.