ఉదయనిధి స్టాలిన్‌‌పై క్రిమినల్‌‌ చర్యలు వద్దు: సుప్రీంకోర్టు

ఉదయనిధి స్టాలిన్‌‌పై క్రిమినల్‌‌ చర్యలు వద్దు: సుప్రీంకోర్టు
  • సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: డీఎంకే నేత, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2023 సెప్టెంబర్‌‌‌‌లో జరిగిన ఓ కాన్ఫరెన్స్‌‌లో ‘సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూల మాదిరి నిర్మూలించాలి’అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. 

ఉదయనిధి స్టాలిన్‌‌పై క్రిమినల్‌‌ కేసులు నమోదు చేయాలంటూ వచ్చిన విజ్ఞప్తులను సోమవారం కోర్టు నిరాకరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌‌ 32 ప్రకారం రిట్‌‌ పిటిషన్లను ఎలా కొనసాగించగలరని జస్టిస్‌‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌‌ ప్రసన్న బి వరాలే ధర్మాసనం ప్రశ్నించింది. 

అనంతరం పిటిషన్లను వెనక్కి తీసుకునేందుకు, చట్ట ప్రకారం ప్రత్యామ్నాయ పరిష్కారాలకు పిటిషనర్లకు కోర్టు అనుమతించింది.