పోలింగ్ జరిగిన 48 గంటల్లోగా ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ఎన్ని ఓట్లు పోలయ్యాయని బూత్ ఓటర్ల డేటాను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఏడీఆర్ ఎన్జీవో సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఆల్రెడీ ఐదు ఫేజుల ఎన్నిలకలు అయిపోయినందున ఇలాంటి తాత్కాలిక ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది.
ఈసీ వెబ్‌సైట్‌లో ఫారమ్ 17సీ డేటాను అప్‌లోడ్ చేయాలన్న అప్లికేషన్‌ను కోర్టు కొట్టిపారేసింది. జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. బూత్ డేటాను అప్‌లోడ్ చేస్తే ఓటర్లు అయోమయంలో పడొచ్చని ఎన్నికల సంఘం కోర్టులో వాదించింది. ఫారమ్ 17సీ డేటా కేవలం అభ్య ర్థి లేదా బూత్ ఏజెంట్‌కు మాత్రమే ఇస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.