
- ఏ అధికారంతో అడుగుతున్నారని ఏపీని నిలదీసిన సుప్రీంకోర్టు
- ఈ విషయంలో ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, శ్రీశైలంను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించాలన్న ఏపీ వితండ వాదా న్ని సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఏ అధికారంతో ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలని వాదిస్తున్నారని ప్రశ్నించింది. ఏపీ వాదనతో ఏకీభవించడం లేదని పేర్కొంది.
విభజనచట్టంలోని వివిధ సెక్షన్లపై ఆరా తీసిన కోర్టు.. ఈ విషయంలో ఏపీకి ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై మంగళ వారం జస్టిస్అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ఉజ్జల్భూయాల్తో కూడిన బెంచ్ విచారించింది. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడంతో పాటు శ్రీశైలం నుంచి విద్యు దుత్పత్తి కోసం తెలంగాణ ఇచ్చిన జీవో 34ను రద్దు చేసేలా ఆర్డర్స్ ఇవ్వాలని ఏపీ కోరింది.
దానిపైనా విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఎలాంటి ఆంక్షల్లేకుండా విద్యుదుత్పత్తి కోసం నీటిని తరలించడం సరికాదని పేర్కొంది. తెలంగాణ సర్కారు ఇచ్చిన జీవో 34పై స్టేట్మెంట్ఇవ్వాలని తెలంగాణ అడ్వకేట్ను ఆదేశించింది. విచారణ మార్చి 18కి వాయిదా వేసింది.
ఏపీ వితండ వాదం..
శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులను పూర్తిగా కేఆర్ఎంబీకి అప్పగించాలని, వాటి నుంచి నీటిని విడుదల చేసే అన్ని ఔట్లెట్లను బోర్డుకే ఇచ్చేయాలని సుప్రీంకోర్టులో ఏపీ వితండ వాదం చేసింది. కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 1(బచావత్ ట్రిబ్యునల్/కేడబ్ల్యూడీటీ 1) అవార్డు ఇప్పటికీ అమలులో ఉందని ఏపీ తరఫు అడ్వకేట్ జైదీప్ గుప్తా వాదించారు.
ఈ సందర్భంలో జోక్యంచేసుకున్న తెలంగాణ తరఫు అడ్వకేట్సీఎస్వైద్యనాథన్.. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలకు సంబంధించి కేడబ్ల్యూడీటీ 2లో వాదనలు జరుగుతున్నాయని, ప్రస్తుతం ఆ కేసు పెండింగ్లో ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.