
మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డికి సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. గతంలో శాసనమండలి చైర్మన్ ఆయనపై అనర్హత వేటు వేయడాన్నిసమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ భూపతిరెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను మంగళవారం కొట్టివేసింది.
గతంలో టీఆర్‌ఎస్ పార్టీ తరపున మండలికి ఎన్నికైన భూపతిరెడ్డి.. 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో భూపతిరెడ్డిపై ఆనాటి చైర్మన్ అనర్హత వేటు వేశారు. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయగా.. అనర్హత వేటు రాజ్యాంగ బద్ధంగా ఉందని, శాసనమండలిలో అతనిపై అనర్హత వేటు సరైనదేనని, భూపతి రెడ్డి వేసిన ఫిటిషన్ ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. శాసనమండలి ఛైర్మన్ భూపతిరెడ్డిపై తీసుకున్న నిర్ణయం పూర్తి స్థాయిలో రాజ్యంగ బద్దంగానే జరిగిందని, దానిపై ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు ఆనాడు స్పష్టం చేసింది.
గత ఎన్నికల ముందు గవర్నర్ కోటాలో ఎన్నికైన రాములు నాయక్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన యాదవ్ రెడ్డి, అలాగే నిజామాబాద్ జిల్లా నుంచి ఎన్నికైన భూపతి రెడ్డి.. ముగ్గురూ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిపై శాసనమండలి ఛైర్మన్ అనర్హత వేటు వేశారు.