ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మరో ఏడు రోజులు మధ్యంతర బెయిల్ ను పొడిగించాలనే పిటిషన్ ను తిరస్కరించింది ధర్మాసనం.కేజ్రీవాల్ కు ఇటీవల ఎలక్షన్స్ ప్రచారంలో పాల్గొనడానికి జూన్ 1 వరకు మధ్యంత బెయిల్ మంజూరు చేసింది కోర్టు. జూన్ రెండున మళ్లీ తిహార్ జైలులో సరెండర్ కావాలని గతంలోనే ఉత్తర్వుల్లో తెలిపింది. అయితే..రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది
లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలుకు వెళ్లిన కేజ్రీవాల్ లోక్ సభ ఎన్నికల సందర్బంగా మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ బెయిల్ గడువు జూన్ 1న ముగియనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ బెయిల్ పొడిగించాలని కోరుతూ సుప్రీమ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం పిటిషన్ ను తిరస్కరించింది.