తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలి రెండోసారి క్షమాపణలు చెప్పడాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది, బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ దాఖలు చేసిన అఫిడవిట్ ను ఏప్రిల్ 10వ తేదీ బుధవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. బాబా రామ్‌దేవ్ కోర్టు ధిక్కార చర్యలను తేలికగా తీసుకుంటున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. తమ ఆదేశాలను పదేపదే ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందకు క్షమాపణ సరిపోదని.. కోర్టు ధిక్కరణ చర్యలకు సిద్ధంగా ఉండండని హిమా కోహ్లీ, అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది.
పతంజలి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాసనం ముందు మాట్లాడుతూ.. జీవితంలో మనుషులు తప్పులు చేస్తుంటారు. అయితే, అటువంటి కేసుల్లో వ్యక్తులు బాధపడాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనికి ప్రతిస్పందించిన అత్యున్నత న్యాయస్థానం న్యాయవాదిని మందలించింది. మేం అంధులు కాదు.. ఈ విషయంలో ఉదారంగా వ్యవహరించాలనుకోవడం లేదు అని ధర్మాసనం బదులిచ్చింది.
పతంజలి డయాబెటిస్, ఆస్తమా వంటి వ్యాధులను ఆయుర్వేదిక్ మందులు, యోగాతో పూర్తిగా నయం చేస్తుందని అడ్వటైజింగ్ చేయడాన్ని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ తప్పుబట్టింది. రామ్ దేవ్ బాబా మెడిసిన్ వాడకంపై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని IMA కోర్టుకు ఫిర్యాదు చేసింది. రామ్‌దేవ్‌పై భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని 188, 269, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Also Read :టెట్ దరఖాస్తు గడువు మరో 10 రోజులు పొడిగింపు
గతంలో కోవిడ్ -19 వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా పతంజలి వ్యవస్థాపకులు రామ్ దేవ్ బాబా క్యాంపెయిన్ నిర్వహించిందని ఆరోపిస్తూ IMA సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పతంజలి ఆయుర్వేదిక్ వ్యాధుల్ని వెంటనే, పూర్తిగా నయం చేస్తుందని చేసిన యాడ్స్ పై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తో యాడ్స్ పబ్లిసిటీ చేసినందుకు పతంజలిపై చర్యలు తీసుకుంటాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది.